కరోనా : మరోసారి ఉదారత చాటుకున్న షారుక్‌

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాటం చేస్తున్న మహారాష్ట్రలోని ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్‌ వర్కర్లకు తన వంతు సహాయంగా 25వేల పీపీఈ (పర్సనల్‌ ప్రొటక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్లను అందించాడు. ఇదే విషయమై మహారాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేష్ తోపే స్పందిస్తూ షారుక్‌కు ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ' థాంక్యూ షారుక్‌.. మీ వంతుగా 25వేల పీపీఈ కిట్లను అందించినందుకు ధన్యవాదాలు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న మెడికల్‌ సిబ్బందికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయంటూ' ట్విటర్‌లో పేర్కొన్నాడు. (తల్లి నుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం)