పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్‌ ట్రైన్‌

హఫీజ్‌పేట్‌ : లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ఎంఎంటీఎస్‌ లోకల్‌ రైలు పట్టాలు తప్పింది. లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్ళే రైలు (47141) సాయంత్రం 5.20 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరింది. 5 నిమిషాల అనంతరం చందానగర్‌ రైల్వే స్టేషన్‌ దాటిన అనంతరం హఫీజ్‌పేట్‌ స్టేషన్‌ వద్ద రైలు చివరి బోగి చక్రం రాడ్‌ విరిగింది. దీంతో పెద్ద శబ్దంతో ఒక్కసారి పట్టాలు తప్పి బోగి పక్కకు ఒరిగింది.  డ్రైవర్‌ అప్రమత్తతో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా రైలును నిలిపిపివేశారు.